హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. మున్నిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. జనవరి 7న పురపాలక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈనెల 30న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు. డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. డిసెంబర్ 31వ తేదీన జిల్లా అధికారులతో రాజకీయ పార్టీల సమావేశం నిర్వహిస్తారు. జనవరి 1న మున్సిపల్ కమిషనర్లతో ఈసీ భేటీ అవుతుంది. జనవరి 3న అభ్యంతరాలకు పరిష్కారం, వివరణ ఇస్తారు. జనవరి 4న ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తారు.
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల